కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామన్న గీతారెడ్డి..

తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక లో కొమరబండ లో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి గీతారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక గీతారెడ్డి మాట్లాడుతూ.. ఉత్తమమైన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అన్నారు.

తెలంగాణలో రైతులు దేశానికి ముఖ్యం అని.. వరంగల్ లో ప్రవేశపెట్టిన డిక్లరేషన్ ని ప్రతి గ్రామానికి చేరవేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. అంతేకాకుండా భూమి ఉన్న కౌలు రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ధరణి పోర్టల్ వ్యవస్థను ఎత్తివేస్తామని అన్నారు.