గన్నవరం వైసీపీలో వర్గ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే, టీడీపీ తరుపున గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ లోకి రావటంతో వర్గ పోరుకు తెరలేచింది. వైసీపీ తరుపున యాక్టీవ్ గా ఉంటున్న యార్లగడ్డ వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో గన్నవరం లో నువ్వా -నేనా అన్నట్లు తయారైయ్యింది. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి పోవటంతో మొన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్న జగన్ పక్కనే ఉన్న,వంశీని యార్లగడ్డను దగ్గరికి పిలిచి కలిసి పనిచేసుకోవాలని చేతులు కలిపి మారి చెప్పటం జరిగింది.
ప్రస్తుతం గన్నవరంలో జరుగుతున్నా పరిణామాలు గమనిస్తే సీఎం జగన్ మాటను అక్కడి వైసీపీ నేతలు లెక్క చేయనట్లే తెలుస్తుంది. తాజాగా యార్లగడ్డ హనుమాన్ జంక్టన్ వెళ్లి మరీ దుట్టా రామచంద్ర రావు ను కలవటం రాజకీయంగా దుమారమే లేపుతుంది. గతంలో దుట్టా మరియు వంశీ మధ్య మంచి స్నేహం ఉండేది, కానీ కొన్ని కారణాల వలన వాళ్ళకి విరోధం ఏర్పడింది, దాంతో యార్లగడ్డ వెళ్లి దుట్టాను కలిసి వంశీకి వ్యతిరేకంగా పనిచేయటానికి ఒప్పించారు. అప్పటి నుండి వంశీ వర్సెస్ యార్లగడ్డ దుట్టా అన్నట్లు గన్నవరంలో వర్గ పోరు సాగుతుంది.
ఈ మధ్య కాలంలో సీఎం జగన్ ఇద్దరి నేతలకు సర్ది చెప్పటంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఇరు వర్గాలు ఇప్పుడు మరోసారి హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా యార్లగడ్డ సీఎం జగన్ మాటను లెక్కచేయకుండా పోరుకు రంగలేస్తున్నాడని , అందుకోసమే మరోసారి దుట్టాను కలవటం జరిగిందని గన్నవరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వంశీకి గన్నవరం బాధ్యతలు అప్పగిస్తే చేజేతులా పార్టీని నాశనం చేసుకోవటమే అవుతుందని, వంశీ ఇప్పటికి కూడా చంద్రబాబుతో టచ్ లోనే ఉన్నాడని యార్లగడ్డ ఆరోపిస్తున్నాడు. అంతగా కావాలంటే వంశీకి విజయవాడ లో ఎక్కడైనా నియోజకవర్గం కేటాయించండి కానీ గన్నవరం మాత్రం అతనికి ఇవ్వటానికి లేదని యార్లగడ్డ ఖరాకండిగా చెపుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వర్గ పోరుకు జగన్ ఎలాంటి ముగింపు ఇస్తాడో చూడాలి.