చంద్రబాబు అండ్ పార్టీ కకావికలం అయ్యే బిగ్ బ్రేకింగ్ ఇది !

2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ రోజు రోజుకు పతనస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే వైసీపీ చేతిలో ఘోర పరాజయం చూసిన టీడీపీ ఇప్పుడు సొంత పార్టీ నేతల నుండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన చాలామంది నాయకులు వైసీపీ బాట పడుతుంటే ఇంకొంతమంది పార్టీలోనూ ఉంటూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. అలా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న వారిలో గళ్ళ జయ దేవ్ ఒకరు.ఆయన వల్ల ఇప్పుడు గుంటూరు టీడీపీ నాయకుల్లో గొడవలు మొదలు అయ్యాయని, గ్రూప్ రాజకీయాలకు గల్లా తెరలేపారని టీడీపీ నాయకులే చెప్తున్నారు.

ఎన్నికల సమయం నుండే విభేదాలు

2019 ఎన్నికల్లో గల్లా నియోజక వర్గంలో ఒక్క గల్లా జయదేవ్ తప్పా మిగితా ఏ టీడీపీ నాయకుడు గెలవలేదు. ఇలా గుంటూరులో టీడీపీ నేతలు ఓటమి పాలు అవ్వడానికి గల్లా జయదేవ్ చేసిన రాజకీయలే కారణమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎంపీ ఓటు మాత్రం తనకు వేసి, ఎమ్మెల్యే ఓటు ఈ ఇష్టం వచ్చినవారికి వేయండని గల్లా ప్రచారం చేశారని, అందుకే కమ్మ సామాజిక వర్గం ప్రజలు గల్లా దూరంగా ఉన్నారని సమాచారం. టీడీపీలో గల్లా వల్ల రెండు గ్రూప్స్ ఏర్పడ్డాయని, ఈ గ్రూప్స్ వల్లే టీడీపీకి ఒక నాలుగు నియోజక వర్గాల్లో పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

చంద్రబాబుకు తెలియదా!!

గల్లా జయదేవ్ పార్లమెంట్ లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ టీడీపీకి మాత్రం ఆయన చేస్తున్న రాజకీయాలు మాత్రం టీడీపీకి చేటు చేస్తున్నాయి. గల్లా చేస్తున్న గ్రూప్ రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలిసి కూడా ఏమి అనలేకపోతున్నారని, ఏవైనా చర్యలు తీసుకుంటే గల్లా కూడా పార్టీ వీడే అవకాశం ఉందని బాబు భయపడుతున్నారని సమాచారం. గల్లా జయదేవ్ విషయంలో రానున్న రోజుల్లో బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.