Roja: నగరిలో రోజాకు షాక్ ఇవ్వబోతున్న జగన్…. వైసీపీ లోకి రానున్న గాలి జగదీష్ ప్రకాష్!

Roja: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అక్కడ వైఎస్సార్ సీపీ నాయకురాలు రోజా గత మూడుసార్లుగా ఎన్నికలలో పోటీ చేస్తూ వచ్చారు. అయితే ఈమె 2014 ,19 ఎన్నికలలో నగరీ నియోజక వర్గం నుంచి విజయం సాధించగా 2024వ సంవత్సరంలో ఓటమిపాలు అయ్యారు అయితే నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీ నుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందనే విషయం కూడా అందరికీ తెలిసిందే .

ఇలా నగరి నియోజకవర్గంలో రోజాకు పూర్తిస్థాయిలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇబ్బందుల్లో పడ్డారు. చివరికి నగరి నియోజకవర్గంలో తాను ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా అన్న పరిస్థితి కూడా నెలకొంది. ఇలాంటి తరుణంలోనే వైసీపీలోకి కీలక నేత రాబోతున్న నేపథ్యంలో రోజా పరిస్థితి అయోమయంగా మారిపోయిందని తెలుస్తోంది.

టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు.. గాలి భాను ప్రకాశ్, గాలి జగదీష్ ప్రకాశ్. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన రోజాను టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఓడించారు. నిజానికి 2024లో టిడిపి నుంచి గాలి జగదీష్ ప్రకాష్ టికెట్ అందుకోవాలని ప్రయత్నం చేశారు కానీ అనుకోకుండా ఈయనకు టికెట్ రాకుండా తన సోదరికి టికెట్ రావడం ఆయన విజయం సాధించడం జరిగింది.

ఈ క్రమంలోనే ఎలాగైనా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలి అన్న ఆకాంక్షతో ఉన్న గాలి జగదీష్ ప్రకాష్ ఈనెల 12వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. అదే జరిగితే నగరి వైఎస్సార్ సీపీలో లెక్కలు మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌పై గాలి జగదీష్ ప్రకాశ్‌కు వైఎస్ జగన్ హామీ ఇస్తే కనుక రోజా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరి నగరి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.