Laptop: ల్యాప్ టాప్ కు అంత్యక్రియలు చేయాలన్నాడు..! నెట్టింట్లో వీడియో వైరల్..

Laptop: ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ వచ్చాక వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో తెలిసిందే. ‘ప్రాణాలు కాపాడే హెల్మెట్ ను తలపై పెట్టుకోరు కానీ.. ప్రాణం లేని వస్తువులకు మాత్రం రక్షణ కల్పిస్తారు’ అనే కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సెల్ ఫోన్ స్క్రీన్ గార్డ్, ఫోన్ గార్డ్, డెకరేషన్.. చేయించి ఇష్టంగా చూసుకుంటాం. సెల్ ఫోనే కాదు.. ల్యాప్ టాప్, డెస్క్ టాప్, ఐ వాచ్.. కాదేదీ ఇందుకు అనహర్హం. ఇలానే ఫీలయ్యాడు ఓ యువకుడు. తాను అమితంగా ప్రేమించి చాన్నాళ్లుగా ఉపయోగించిన ల్యాప్ ట్యాప్ పాడైంది. తట్టుకోలేక పోయాడు.

ఇక రిపేర్ కాదని తెలిసి స్క్రాప్ లో పడేయలేక.. ల్యాప్ టాప్ కు అంత్యక్రియలు చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ రిసెప్షనిస్టుతో అంత్యక్రియలు చేయాలని కోరాడు. దీంతో మృతదేహం ఎక్కడ అని రిసెప్షనిస్టు అడిగింది. అందుకు ల్యాప్ టాప్ తీసి చూపించాడు. ఇదేంటని అడిగిన రిసెప్షనిస్టుకి ‘అంత్యక్రియలు చేయాల్సింది దీనికే’ అని చెప్పాడు. ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

మీ ల్యాప్ టాప్ చచ్చిపోయిందా? అని ఆమె అడగుతుంటే.. అవునని యువకుడు ల్యాపీని చూపిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటెర్నెట్ ను షేక్ చస్తోంది. ల్యాప్ టాప్ కు అంత్యక్రియలు జరపాలి.. ఇందుకు ఏమైనా చేయగలరా? ఆ యువకుడు అడగితే.. ఆమె ‘నో’ చెప్పింది. టిక్ టాక్ లో ఈ వీడియోకు ఏకంగా 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టిక్‌టాక్‌ స్టార్‌ జెన్‌ @కింగ్‌జెన్‌ ఈ వీడియో చేశాడు. ఈ తతంగమంతా వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో ఈ టిక్‌టాక్‌లో బాగా వ్యూస్‌ వచ్చాయి.

గ్యాడ్జెట్స్‌పై మనకుండే ప్రేమను చూపేందుకు ఈ వీడియో చేసానని ఈ టిక్‌టాక్‌ స్టార్‌ అంటున్నాడు. గ్యాడ్జెట్లను మనలో శరీరంలో ఒక పార్ట్ గా భావిస్తున్నాం. ఉదయం నిద్రేలవగానే చూసేది సెల్ ఫోన్ నే. మొబైల్ లేకపోతే పనులు జరగని పరిస్థితి నెలకొంది. దీంతోనే ఈ వీడియో చేశాడు జెన్. ఈ వీడియోకు మంచి కామెంట్లు వస్తున్నాయి. అయితే జెన్ ఏ దేశస్తుడో మాత్రం వీడియోలో వివరాలు తెలియరాలేదు.

Man Tries To Organise Funeral For His Laptop!