Crime News: పరమేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్లిన ముగ్గురు స్నేహితులు స్థానం కోసం కాలువల దిగగా నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయట పడగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృత్యువు ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరు అంచనా వేయలేరు. ఆ శివుని దర్శించుకున్న మన వెళ్ళిన వారు ఎవరికి కనిపించకుండా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన వల్ల మృతుల కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామానికి చెందిన అజయ్ కుమార్ ఆర్ అని స్నేహితులైన మణికంఠ, యశ్వంత్ రాజా ఇద్దరితో కలిసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. అయితే దర్శనానికి వెళ్లే ముందు స్నానం చేయటం కోసం కాలువలో నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా స్నానం కోసం కాలువలో దిగారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రవాహ దాడికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మణికంఠ ను కాపాడారు. మిగిలిన ఇద్దరిని కాపాడటానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో మిగిలిన ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. పండగ పూట ఇలాంటి దారుణమైన ఘటన జరగడం వల్ల మృతుల కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారింది. పోలీసులు మణికంఠ ను విచారించగా.. స్నానం చేయాలని ముగ్గురం కాలువలో దిగగా ఎవరో నా కాలు పట్టుకొని లాగినట్టు అనిపించింది. వెంటనే నేను పైకి తేలి చూసేసరికి నా స్నేహితులు ఇద్దరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
రక్షించండి అని అరవగ స్థానికులు వెంటనే స్పందించి తనని కపదరని,తర్వాత తన మిత్రులను రక్షించటానికి ప్రయత్నించిన లాభం లేదని తెలిపారు.