కేసీఆర్ ఎప్పుడు హోమాలు ,పూజలు చేస్తుంటాడు, అలాంటి కేసీఆర్ కు జలగండం ఏంటి అనుకుంటున్నారా..? వ్యక్తిగతంగా కాకపోయినా కానీ, కేసీఆర్ అధికారానికి జలగండం ఉన్నట్లు సృష్టంగా అర్ధం అవుతుంది. నిన్నటికి నిన్న కల్వకుర్తి ఇరిగేషన్ ప్రాజెక్టు బ్లాస్టింగ్ జరిగి నీటి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. శ్రీశైలం నుంచి నీరు తీసుకునేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎల్లూరు వద్ద ఉంది. ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం నిర్మిస్తోంది. ఈ పథకంలో భాగంగా పంపుహౌస్‌తో పాటు అప్రోచ్ చానల్ ఎల్లూరు ఎత్తిపోతలకు సమీపంలోనే నిర్మిస్తున్నారు.
అక్కడ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరించినా పనులు చేయడంతోనే సమస్య వచ్చింది. ఆ కాంట్రాక్టర్‌కు లబ్ది చేకూర్చడానికే.. ప్రత్యేకంగా తప్పుడు నివేదికలు తప్పించి మరీ ప్రాజెక్ట్ బ్లాస్టింగ్ చేయించారని రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఆరోపిస్తున్నారు. నెల రోజల క్రితం శ్రీశైలం డ్యామ్ కి వరద నీరు రావటంతో విద్యుత్ ఉత్పతిని ప్రారంభించే సమయంలో జరిగిన తప్పులు వలన ఘోర ప్రమాదం జరిగి, అధికారాలు చనిపోవటం జరిగింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం హైదరాబాద్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు మరో ఎత్తు. ఐదారు రోజుల నుండి హైదరాబాద్ జల వలయంలో చిక్కుకొని పోయింది. దాదాపు 70 మంది చనిపోయారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోండి, దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క చేతకానితనమే అంటూ సామాన్యలు నిందిస్తున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆయనకు ఎదురైనా చేదు అనుభవాలను గమనిస్తే తెరాస ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏంటది వ్యతిరేకత ఉందొ అర్ధం అవుతుంది. ఇవన్నీ గమనిస్తే కేసీఆర్ సర్కార్ కి జలగండం ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.