‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నుండి లచ్చిమి పాట విడుదల

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా  ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.  సినిమా కథాంశాన్ని ఆవిష్కరించిన టీజర్ వీడియోలో అల్లరి నరేష్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నికల విధులకు వచ్చిన  ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించారు.

తాజాగా ఈ సినిమా నుండి ‘లచ్చిమి’ అనే పాటని విడుదల చేసి చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని గ్రాండ్  ప్రారంభించింది. శ్రీచరణ్ పాకాల ఈ పాటని మళ్ళీ మళ్ళీ పడుకొని క్యాచి ట్యూన్ గా ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. జావేద్ అలీ తన వాయిస్ తో మెస్మరైజ్ చేయగా.. శ్రీమణి అందించిన సాహిత్యం పాటకు మరింత నిండుదనం తెచ్చింది.

ఈ పాటలో అల్లరి నరేష్ తన స్క్రీన్ ప్రజన్స్ అద్భుతంగా వుంది. బీట్ కి తగ్గట్టు చేసిన కూల్ డ్యాన్స్ మూమెంట్స్ హుషారు తెప్పించాయి. పచ్చని ప్రక్రుతి అందాలు ఈ పాటలో చాలా ప్లజంట్ గా చిత్రీకరించారు,. కథానాయిక ఆనంది స్క్రీన్ ప్రజన్స్ చాలా బ్యూటీఫుల్ గా వుంది. ఈ పాట ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాంరెడ్డి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 11న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్
నిర్మాత: రాజేష్ దండా
నిర్మాణం: జీ స్టూడియోస్,  హాస్య మూవీస్
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డైలాగ్స్: అబ్బూరి రవి
డీవోపీ: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
స్టంట్స్: పృథ్వీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ
డిఐ – అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ-శేఖర్