ప్రపంచ వ్యాప్తంగా అబద్దం అని తెలిసి కూడా నమ్మేది ఏదన్నా ఉంది అంటే అది సినిమానే అని చెప్పాలి. ఎన్నో ఎమోషన్స్ తో ఇప్పుడు థియేటర్స్ లో సినిమా ఆడియెన్స్ ని ఎంత గానో సినిమా అలరిస్తుంది. మరియు అలా రోజులు మారె కొద్దీ సినిమా వసూళ్ల స్పాన్ కూడా ఎంత గానో పెరుగుతూ వస్తుంది.
అయితే మన ఇండియన్ సినిమా ఎప్పుడో 1000 కోట్ల మార్క్ మార్కెట్ ని ఎప్పుడో అందుకోగా ఇప్పుడు పాకిస్తాన్ సినిమా మొట్టమొదటి సారిగా హిస్టరీ క్రియేట్ చేసిందట అక్కడ పాకిస్తానీ పంజాబీ భాషా చిత్రం మొదటి సరిగా 100 కోట్ల వసూళ్లు అందుకున్న చిత్రంగా రికార్డు సెట్ చేసినట్టు సినిమా వర్గాల్లో టాక్ ఇప్పుడు నడుస్తుంది.
మరి ఆ చిత్రం “ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్” కాగా ఈ చిత్రం ఈ అక్టోబర్ 10న రిలీజ్ కాగా అది ఇప్పుడు 100 కోట్లు వసూలు చేసిందట. దీనితో పాకిస్తాన్ సినిమా నుంచి మొదటి 100 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా ఇది నిలిచినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ చిత్రం ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఫవాద్ ఖాన్ మహీరా ఖాన్ లు నటించారు. మొత్తానికి అయితే వాళ్లకి కూడా చెప్పుకోడానికి ఓ సినిమా దక్కింది అని చెప్పాలి.
Pakistan 🇵🇰 has a new industry hit! #TheLegendOfMaulaJatt crosses 100 Crs PKR at the WW Box office..
70% of revenue from International markets.. pic.twitter.com/EEBZtKBuEK
— Ramesh Bala (@rameshlaus) October 27, 2022