ఇక “ఆదిపురుష్” లాస్ట్ వర్క్ కోసం ప్రభాస్..?

Finally Prabhas Steps In For Adipurush His Final Shoot | Telugu Rajyam

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఒకటైన “రాధే శ్యామ్” నుంచి వచ్చిన సింగిల్ టీజర్ భారీ రెస్పాన్స్ తో రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ప్రభాస్ తన మరో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

అయితే వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న మైథలాజికల్ సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ లో తన లాస్ట్ వర్క్ కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ముంబై లోని భారీ సెట్స్ లో ఈ షూట్ స్టార్ట్ కానుందట.

అంతే కాకుండా ఈ షూట్ తో ప్రభాస్ తన పార్ట్ అంతా కంప్లీట్ చేసేసినట్టే అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాలో రావణ్ పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్, అలాగే సీత పాత్రలో చేసిన కృతి సనన్ లు తమ తమ షూటింగ్స్ కంప్లీట్ చేసేసుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles