రాజ్యాంగ విజయమన్న చంద్రబాబు.. మాట మీద నిలబడ్తారా.?

Finally, Chandrababu Gets Laugh, But.!

Finally, Chandrababu Gets Laugh, But.!

సింగిల్ బెంచ్ ఓ తీర్పునిచ్చింది.. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ‘డివిజన్ బెంచ్’ని ఆశ్రయించాలనుకుంటోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇంతలోనే, సింగిల్ బెంచ్ తీర్పుని రాజ్యాంగ విజయంగా అభివర్ణిస్తే ఎలా.? కాస్సేపు ఆనందపడాలనే ఆలోచన చంద్రబాబుకి వుంటే, దాన్నెవరూ కాదనలేరు. కానీ, డివిజన్ బెంచ్ తీర్పు ఎలా వుంటుందో చెప్పలేం కదా.. ఆ తీర్పుతో చంద్రబాబు ఆనందం ఆవిరైపోవచ్చు కూడా. లేదంటే, రాష్ట్ర ప్రభుత్వానికీ, అధికార పార్టీకీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి కూడా షాక్ తగలొచ్చు. ప్రస్తుతానికైతే ఈ మూడింటికీ షాక్ తగిలింది సింగిల్ బెంచ్ తీర్పు కారణంగా. అదే చంద్రబాబు ఆనందానికి కారణం. పరిషత్ ఎన్నికల వ్యవహారంపై జరుగుతున్న తంతు ఇదంతా.

సరిగ్గా ఎన్నికలకు రెండ్రోజుల ముందు తీర్పు రావడం.. అది కూడా, ఎన్నికల్ని నిలుపుదల చేస్తూ తీర్పు రావడం అధికార పార్టీకి నిజంగానే పెద్ద షాక్. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా షాక్ అవ్వాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ విధుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోజాలవు.. అంటూ అధికార పార్టీ చెబుతోంది. అదే నిజమైతే, గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో వున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఇలా అధికార పార్టీ ఎందుకు అనలేకపోయింది. అదంతే, ఎవరికి అనుకూలమైన వాదనలు మాత్రమే వారు వినిపిస్తారు తప్ప.. ఇక్కడ రాజ్యాంగం, చట్టం.. ఇవేవీ రాజకీయ పార్టీలకు అనవసరం. డివిజన్ బెంచ్ తీర్పు గనుక పరిషత్ ఎన్నికలకు అనుకూలంగా వస్తే, అప్పుడు చంద్రబాబు రాజ్యాంగ పరాజయం.. అని అభివర్ణించగలరా.? ఏమో, అలా విమర్శించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కోర్టుల తీర్పులపై విపరీతార్థాలు తీయడం అధికార వైసీపీకి కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే సంగతి. ఏదిఏమైనా.. రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వైరం కారణంగా వ్యవస్థల పట్ల ప్రజల్లో చిన్నచూపు కలిగే పరిస్థితి వస్తోందన్నది నిర్వివాదాంశం.