“RRR” పై బిగ్ అప్డేట్ కన్ఫర్మ్..ఓటిటిలో రిలీజ్ పై గుడ్ న్యూస్.!

RRR Movie Ott : ఇండియన్ సినిమా దగ్గర ఈ ఏడాది దుమ్ము లేపిన సినిమాల్లో మన టాలీవుడ్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి. దర్శకుడు రాజమౌళి మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తెరకెక్కించిన ఈ భారీ ఇండియన్ యాక్షన్ డ్రామా థియేటర్స్ లో భారీ వసూళ్లను కొల్లగొట్టి ఇప్పుడు ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.

అయితే ఓటిటి లో రిలీజ్ పట్ల గత కొన్ని రోజులు నుంచి సినీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తూ వచ్చింది. ఈ మే 20న ఈ సినిమా జీ సంస్థ జీ ప్లెక్స్ లో స్ట్రీమింగ్ కి వస్తుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే అందులో డబ్బు పెట్టి మళ్ళీ చూడాలి. దీనితో దానిపై కాస్త నెగిటివ్ టాక్ అయితే వినిపించింది.

అయితే ఇది వారి వరకు వెళ్లిందో ఏమో కానీ ఇప్పుడు 20నే ఈ సినిమా జీ 5 లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు బిగ్ అప్డేట్ ని అందించారు. తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చెయ్యగా హిందీలో అయితే ఇంకా ఏ అప్డేట్ ఇవ్వలేదు.

మరి బహుశా హిందీలో పే పేరు వ్యూ లో తీసుకొస్తారేమో చూడాలి. మన వరకు అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్ మరియు శ్రేయ, ఒలీవియా మోరిస్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.