రాజకీయాల్లో చాటు మాటుగా జరిగే వివాదాలకు కొదువే లేదు. ఈ మధ్యకాలంలో అయితే ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఒకే నియోజకవర్గానికి చెందిన అభ్యర్ధులు దూషించుకోవడంలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతూనే ఉన్నాయి.. రాజకీయపార్టీ అన్నాక ఆ మాత్రం లొసుగులు ఉంటాయిలే అని అనుకుంటారా.. ఆ గొడవలు ప్రజల్లోకి వెళ్లనంత వరకు ఫర్వాలేదు గానీ ప్రజాసేవ కోసం పార్టీలోకి వచ్చామని చెప్పి పరపతి కోసం ప్రాకులాడితే మాత్రం ఏదో ఒకప్పుడు తగిన శాస్త్రి జరుగుతుంది..
ఇక రాజకీయాల్లో వలసలు సర్వసాధారణమే అయినప్పటికి ఈ వలస వచ్చే నాయకుల వల్ల అప్పటి వరకు పార్టీని పట్టుకున్న వారికి తగినంతగా గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తి కనిపిస్తుంది.. అంటే టూకీగా చెప్పాలంటే ఒకే ఒరలో రెండు కత్తులు ఎలాగైతే ఇమడవో, ఒక సీటులో ఇద్దరు నేతలు కూడా సాధ్యపడరు.. ఇలాంటి తగువే ఇప్పుడు వైసీపీలో కనిపిస్తుందట.. ఇకపోతే చంద్రబాబు హయాంలో వైసీపీతరఫున గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను తన సైకిల్ ఎక్కించుకుని ఈ కొత్త సంస్కృతికి బీజం వేశారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ కూడా ఈ సూత్రాన్నే పాటిస్తున్నారట. ఈ నేపధ్యంలో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటున్నారట. సీయం జగన్ గారు..
ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన వైసీపీ నేతలకు.. టీడీపీ తరఫున గెలిచి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నవారికి మధ్య అసలు పొత్తు కుదరడం లేదట.. దీని ఫలితంగా తరచుగా వివాదాలు తలెత్తుతున్నాయంటున్నారు కొందరు నాయకులు.. ఇది నిజం చేస్తూ ఇప్పటికే ఈ తరహా వివాదం.. గన్నవరంలో చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ తరపున ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే వంశీని, జగన్ పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే, ఇక్కడ నుంచి ఓడిపోయిన వైసీపీ నాయకుడు, ఆయనకు సహకరించిన మరో నాయకుడు వంశీతో చేతులు కలపలేక పోతున్నారట. ఇదేగాక ప్రస్తుతం గుంటూరు వెస్ట్‌లో ఇలాంటిదే మరో కుంపటి రగులుకుందట.
ఇక్కడ నుంచి గత ఏడాది ఎన్నికల్లో వైఎస్ జగన్ ధాటిని తట్టుకుని టీడీపీ అభ్యర్థిగా, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి మద్దాలి గిరి విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి ఏసురత్నం ఓడిపోయారు. ఆ తర్వాత గిరిని వెదిఏస్ జగన్ తనవైపు తిప్పుకొన్నారు.. ఈ క్రమంలోనే ఏసురత్నం, గిరిల మధ్య వివాదాలు రాకుండా చూసేందుకు రత్నానికి.. మార్కెట్ యార్డు చైర్మన్ ఇచ్చారు. దీంతో కొన్నాళ్లు వీళ్ళిద్దరు బాగానే ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో మద్దాలి గిరి అనుచరులు ఫ్లెక్సీ రాజకీయాలకు తెరదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఇంచార్జ్ పీఠం కోసం భారీ రేంజ్‌లో కొట్లాట జరుగుతోందట. ఇలా ఒక్క కుర్చీ కోసం వైసీపీ లో జూట్టూ జూట్టూ పట్టుకుంటున్న నేతల తీరు సీయం జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారిందని పరిశీలకులు అంటున్నారట..