ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న భ‌యం

ఎన్నాళ్ళనుండో ప్రభాస్ ఫాన్స్ ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఎట్టకేలకు ‘సలార్’ టీం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని టాక్ ఉంది. సెప్టెంబర్ 2023 లో మొదటి భాగం రిలీజ్ అయితే 2024 లో రెండవ భాగం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ పోస్టర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి. ఊర మాస్ పోస్టర్ ఆంటూ కామెంట్స్ పెడుతున్నారు. ది ఎరా ఆఫ్ సలార్ బిగిన్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఒక కమాండర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా…ఫాన్స్ లో ఒక భయం మొదలైంది. ఎందుకంటే.. అదే రోజు ప్రభాస్ నటించిన `రెబ‌ల్‌` సినిమా విడుద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు.. అదే రోజున ‘స‌లార్’ విడుద‌ల అవుతోంద‌న్న‌ది ప్రభాస్గ‌ అభిమానులు భయపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ‌. ఫ్లాప్ సినిమా విడుద‌లైన రోజున‌.. మ‌రో సినిమాని వ‌ద‌ల‌డానికి హీరోలు ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌రు. కానీ ప్ర‌భాస్ మాత్రం అవన్నీ పట్టించుకోవడంలేదు.