దారుణం.. కన్నతండ్రే 10 ఏళ్లుగా సొంత కూతురిపై అత్యాచారం.. ఇటువంటి తండ్రిని ఏం చేయాలి?

father rapes his own daughter in rajasthan

తండ్రి అంటే ఎవరు? దేవుడితో సమానం. తన బిడ్డను జన్మను ప్రసాదించి దేవుడిలా చూసుకోవాల్సిన వ్యక్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తే అసలు తండ్రి అనే పదానికి అర్థం ఉంటుందా? కొందరు వ్యక్తులు తండ్రికి ఉన్న విలువను కూడా రోజురోజుకూ తీసేస్తున్నారు.

father rapes his own daughter in rajasthan

అలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్ లోని కోటా జిల్లాలో చోటు చేసుకున్నది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారం చేశాడు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.. ఏకంగా 10 ఏళ్ల నుంచి ఆ తండ్రి.. కూతురిపై అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడు. 10 ఏళ్ల నుంచి ఆ యువతి తండ్రి చేష్టలను భరిస్తూ వచ్చింది. బయటికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది.

చివరకు ధైర్యంగా ముందుకు వచ్చి.. తండ్రి తనపై చేసిన అఘాయిత్యాన్ని పోలీసులకు చెప్పింది. 23 ఏళ్లు ఉన్న ఓ యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి గత 10 ఏళ్ల నుంచి తన తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నట్టు వెల్లడించింది.

తన తండ్రి రైల్వేస్ లో ఉద్యోగి అని.. తనను ఇంట్లోనే కాకుండా.. పలు చోట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నది. తననే కాకుండా.. తన చెల్లిని కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడని.. తన తల్లికి ఈ విషయం తెలిసినప్పటికీ.. తను బయటికి చెప్పలేదని.. బయటికి చెప్తే చంపేస్తానని తన తల్లిని బెదిరించాడని ఆ యువతి వాపోయింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తునన్నారు. వెంటనే యువతిని వైద్య పరీక్షలకు పంపించారు.