ఒకే ఒక్క సంఘటన – మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి !

Russian President Vladimir Putin endorsed PM Modi’s emphasis on terrorism

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను పట్టించుకున్నారో లేదో కానీ మీడియాను మ్యానేజ్ చెయ్యడంలో చాలా మాత్రం సక్సెస్ అయ్యారు. మోడీ తనకు ఉన్న మీడియా బలంతో దేశంలో ఉన్న అనేక సమస్యలను బయటకు రాకుండా చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఉద్యమాలను మీడియా సహాయంతో అణిచివేస్తున్నారు. మోడీకి ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించినా సరే తనకు అనుకూలంగా ఉన్నా మీడియాతో అణిచివెయ్యడానికి చూస్తున్నారు. ఇలా దేశంలో మోడీ వల్ల చాలా మంది నిశ్శబ్దంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో రైతుల ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమాన్ని కూడా మోడీ అణిచి వెయ్యడానికి చూస్తున్నారు.

pm modi
pm modi

రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు??

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండానే మోడీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తుందని, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తున్నారని, వీటి వల్ల తమకు నష్టం జరుగుతుందని రైతులు ఉద్యమం చేస్తున్నారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. ఈ ఉద్యమాన్ని అణిచివెయ్యడానికి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంది. కానీ రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఉద్యమాన్ని అణచివేస్తున్న మోడీ

నూతన చట్టాలను చేసే ధైర్యం ఉన్న మోడీ వాటికి వచ్చే వ్యతిరేకతను తీసుకునే ధైర్యం, తప్పులు ఉంటే సవరించుకునే ఆలోచనలు మాత్రం లేవు. ఎవ్వరు ఎక్కడ వ్యతిరేకంగా వ్యవహరించినా కూడా వాళ్లను పోలీసుల సహాయంతో, మీడియా సహాయంతో, సోషల్ మీడియా సహాయంతో అణచివేయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు రైతులు మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా రైతులు బలంగా నిలబడి తమ వాదనను వినిపిస్తుంది. మీడియా ఎప్పటిలాగే పట్టించుకోకుండా హీరోయిన్స్ బికినీ ఫొటోస్ ను చూపిస్తూ కాలక్షేపం చేస్తుంది. మోడీ చేస్తున్న ఈ చీప్ రాజకీయాలకు కాలం దగ్గర పడిందని, ప్రతిసారి అధికారాన్ని ఉపయోగించి ఉద్యమాన్ని అణచలేరని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశం మొత్తం మద్దతు ప్రకటిస్తుంది. ఈ ఉద్యమం మోడీకి ఇబ్బందులు తెస్తుందని తెలుస్తుంది.