Mokshagna: నందమూరి నట సింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ వస్తుంది అయితే నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాని ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఇలా ఈ సినిమాకు కేవలం పోస్టులు పోస్టర్ విడుదల చేశారు తప్ప ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ వెల్లడించలేదు. అంతేకాకుండా ఈ సినిమా డిసెంబర్ లోనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా ప్రారంభిస్తారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకోలేదు దీంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ ఒక వార్త బయటకు వచ్చింది.
ఇలా మోక్షజ్ఞ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ స్పందిస్తూ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడిగా శ్రీ లీల నటించబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. అలాగే శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ సైతం ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్న ఇప్పటివరకు మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
ఇలాంటి తరుణంలోనే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినీ నిర్మాతలను హీరోయిన్ విషయంలో పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడీగా మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస హిట్ సినిమాల ద్వారా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇలాంటి హీరోయిన్ మోక్షజ్ఞ సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అందుకే ఈమెని మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.