Urfi Javed: సోషల్ మీడియాలో వచ్చాక సెలబ్రిటీలు ఏది చేసినా.. కూడా నెటిజెన్లు ఇట్టే కామెంట్లు పెట్టేస్తున్నారు. మంచి అయినా చెడు అయినా.. క్షణాల్లో జనాల్లోకి వెళ్లిపోతోంది. సాధారణంగా కొన్ని విషయాల్లో ట్రోలింగ్ సాధారణమైంది. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైన్ ఉర్ఫీ జావేద్ కూడా ట్రోలింగ్ బారిన పడింది. ఎప్పుడూ లేటెస్ట్ డ్రెస్సులతో దర్శనమిచ్చే ఈ భామ మరో కొత్త డెస్సింగ్ తో అభిమానులు ముందుకు వచ్చింది. ఓపెన్‌కట్ టాప్, పొట్టి స్కర్ట్‌తో బోల్డ్‌గా దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఈ డ్రెస్సులో ఆమె అందాల ఆరబోతకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈఫోటోను కొందరి యువకుల మతి పోగొడుతుంటే.. మరికొంత మంది నెటిజెన్లు మాత్రం ఉర్ఫీని ఓ ఆట ఆడుకున్నారు. ‘ఆ మాత్రం దుస్తులు కూడా ఎందుకు వేసుకున్నావ్..’ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి బట్టలు వేసుకోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ట్రోలింగ్ ఊర్పీకి కొత్తకాదు. గతంలో కూడా ఇలానే ట్రోలింగ్ కు గురైంది. ప్రియాంక పోనీ టెయిల్ హేర్ స్టైల్ ను కాపీ కొటిందంటూ గతంలో నెటిజెన్లు ట్రోలింగ్ చేశారు. అయితే దీనికి ఘాటైనే రిప్లేనే ఇచ్చింది ఉర్ఫీ. జడ అల్లుకోవడం కూడా కాపీయే అంటే ఈ సమాజం తలదించుకోవాలంటూ ట్రోలింగ్‌కు సమాధానం ఇచ్చింది.