రామ్ పోతినేని పాటకి మాస్ స్టెప్పులు వేసిన అలనాటి ప్రముఖ దర్శకుడు!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రతి శెట్టి జంటగా నటించిన సినిమా “ది వారియర్”. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రిన్స్‌ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ‘బుల్లెట్టు’ పాట ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్‌ దక్కించుకుంది. ఇప్పటికే ఈ పాట 100 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటని ప్రముఖ తమిళ్ హీరో శింబు ఆలపించారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ‘బుల్లెట్టు’ పాటకి అలనాటి ప్రముఖ దర్శకుడు భారతీరాజా స్టెప్పులు వేసాడు. ఈ కాలం వారికి ఈయన గురించీ పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు మాత్రం బాగా తెలిసే ఉంటాయి.పదహారేళ్ళ వయసు సినిమా ద్వారా మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్న భారతీరాజా తర్వాత కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోలు నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం వహించాడు. తెలుగులో కూడా ఈయన దర్శకత్వం వహించిన ‘కొత్త జీవితాలు’, ‘ఆరాధన’, ‘సీతాకోక చిలుక’ వంటి సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.

భారతీరాజా ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన లింగస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ది వారియర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన బుల్లెట్టు పాటకు దర్శకుడు లింగుస్వామి తో పాటు భారతీరాజా కూడా స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం వీరి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ పోతినేని ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ప్రేక్షకులకి కనిపించనున్నారు.రామ్ కి జోడీగా అందాల భామ కృతి శెట్టి కనిపించనుంది. ఇక ఈ సినిమాలో విలన్‌ పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.