Suicide:ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తమామలతో సంతోషంగా ఉండాలని కలలు కంటుంది. కానీ కొన్ని పరిస్థితులవల్ల అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధలు రావటం మనం చూస్తూనే ఉంటాం. సహజంగా కొందరి ఇళ్ళల్లో అయినా అత్తా గొడవ పడుతూ ఉంటారు. అత్తింటివారు వేధింపుల వల్ల అమ్మాయిలు అక్కడ ఉండలేక వారిపై గృహహింస చట్టం కింద కేసులు పెట్టడం మనమందరం చూసే ఉంటాం. అలా కాకుండా కొన్నిసార్లు గొడవలు పెద్దవి కావడంతో కోడళ్ళు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
కానీ ప్రస్తుత కాలంలో ఇంట్లో ఆడవారివల్ల మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అన్ని విషయాల లోనూ మగవారికి సమానంగా ఉండే ఆడవారు పోట్లాట విషయంలో కూడా మగవారికి సమానంగానే ఉంటున్నారు. ఈమధ్య ఆడవారు వేధించటం వల్ల మగవారు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి హుబ్లీ లో చోటు చేసుకుంది. అత్త వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో మహమ్మద్‌రఫిక్ నదాఫ్ అనే వ్యక్తి భార్య అసామాతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తన ఇంటి ఎదురుగానే తన అత్త సాహెబీ నివాసం ఉంటుంది. తన అత్త తో పాటు ఎదిరింటిలో ఉంటున్న ముదుకప్ప, మాంత్యలు తరచూ సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో మహమ్మద్‌రఫిక్ నదాఫ్ మనస్థాపం చెంది సోమవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.