పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లి తెరకు పరిచయమైన వారిలో ఫైమా, ప్రవీణ్ ఒకరు. ఈ కార్యక్రమాల ద్వారా వీరిద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయం అలాగే కొనసాగుతూ ప్రేమగా మారింది. ఇలా పటాస్ ప్రవీణ్, ఫైమా మధ్య ఉన్న రిలేషన్ గురించి వీరిద్దరూ బయట పెట్టకపోయినా వీరిద్దరూ మాత్రం ప్రేమలో ఉన్నట్టుగానే వ్యవహరించారు. వీరిద్దరూ కలిసి కారు కొనుక్కొని హైదరాబాద్ వీధులలో చక్కర్లు కొడుతూ ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా ఫైమా పటాస్ ప్రవీణ్ తో కలిసి ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేస్తూ సందడి చేశారు.
ఇలా వీరిద్దరి ఎంతో చనువుగా ఉండడంతో వీరి మధ్య ప్రేమ ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రవీణ్ తనలో ఉన్న ప్రేమను పలుసార్లు వ్యక్తపరిచిన ఫైమా నో అని సమాధానం లేకుండా ప్రేమను అంగీకరిస్తున్నట్లు ప్రవర్తించేది. ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రవీణ్ కన్నా ఫైమాకి ఎంతో మంచి క్రేజ్ వచ్చింది.అయితే తనకు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ రావడంతో కాళ్ళు భూమి పై నిలబడ లేకుండా ఉన్నాయి. దీంతో తనకు గుర్తింపు రావడం వల్ల ప్రవీణ్ ను సైతం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఇద్దరు జబర్దస్త్ కార్యక్రమంలో చేస్తున్నప్పటికీ వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అందుకే గత కొంత కాలం నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేశారు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. జబర్దస్త్ నిర్వాహకులు వీరిద్దరిని కలపాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఫైమా మాత్రం ప్రవీణ్ తో మాట్లాడటానికి ఏ మాత్రం ఆసక్తి కనబరచడం లేదంట. ఇలా పటాస్ కార్యక్రమం ద్వారా ఎంతో చనువుగా ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయారు. అయితే ఫైమాకు జబర్దస్త్ ద్వారా గుర్తింపు రావడంతో ప్రవీణ్ దూరం పెట్టిందని వార్తలు బలంగా వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన ఎంతో మంది నెటిజన్లు ఫైమా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.