“ఆదిపురుష్” త్రీడీ టీజర్ స్క్రీనింగ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా త్రీడీ వెర్షన్ టీజర్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 60 థియేటర్ లలో రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను త్రీడీ ఫార్మేట్ లో చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

టీజర్ గూస్ బంప్స్, త్రీడీలో టీజర్ను బాగా ఎంజాయ్ చేశాం, టీజర్ చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో అర్థమవుతోంది..అంటూ వాళ్లు తమ ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టీజర్ ను అయోధ్య నగరంలో విడుదల చేసిన టీమ్..త్రీడీ వెర్షన్ టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రభాస్ అండ్ మూవీ టీమ్… ప్రేక్షకులు, అభిమానుల కోసం పలు థియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేసింది. ఈ స్క్రీనింగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే సంక్రాంతి పండక్కి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.