Ex Home Minister Sucharita : ఫాఫం మేకతోటి సుచరిత.! ఇంత అన్యాయమెందుకు జరిగిందో.!

Ex Home Minister Sucharita :  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం హోం మంత్రి పదవిలో మేకతోటి సుచరిత చాలా చాలానే చేశారు. ఎక్కడా తన ముద్ర అంటూ లేకుండా, కేవలం ‘జగనన్న ముద్ర’ మాత్రమే వుండేలా వ్యవహరించారు.

ఇంతా చేసినా మేకతోటి సుచరితకు మంత్రి పదవి కొనసాగింపు ఎందుకు దక్కలేదు.?

పైగా, ఎస్సీ మంత్రులందర్నీ కొనసాగించి తనను మాత్రమే పక్కన పెట్టారంటూ మేకతోటి సుచరిత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తీవ్ర అసహనంతో ఊగిపోతున్నారట.

ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా కూడా చేశారు. అయితే, ఆ రాజీనామా విషయమై అధికారిక సమాచారం రావాల్సి వుంది. ఒకవేళ ఆమె రాజీనామా చేసినా, దాన్ని ఆమోదించే పరిస్థితి వుండదు.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, మేకతోటి సుచరితకు అనూహ్యంగా హోంమంత్రి పదవి దక్కింది. గడచిన మూడేళ్ళలో పోలీసు శాఖ తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంది. పోలీస్ బాస్.. పలు మార్లు హైకోర్టు గడప తొక్కాల్సి వచ్చింది.. హైకోర్టు నుంచి చీవాట్లూ ఎదుర్కోవాల్సి వచ్చింది.

పోలీసు శాఖపై మచ్చ రాకుండా హోం మంత్రి మేకతోటి సుచరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం వున్నా, అధినేత మెప్పు దిశగా మాత్రమే ఆమె వ్యవహరించారు. ఈ క్రమంలో చాలామంది పోలీసు అధికారులు చాలా చాలా విమర్శలు ఎదుర్కొన్నారన్న వాదన వుంది.

సరే, ప్రాంతీయ పార్టీలో.. అధికార పార్టీ అధినేత చెప్పినట్లే అంతా నడుస్తుందనుకోండి.. అయితే, అది వైసీపీ హయాంలో ఇంకాస్త ఎక్కువగా జరుగుతోందంతే.!