ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదంటూ..మాధవన్ రాకెట్రీ పై స్పందించిన రజినీకాంత్?

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాల హవా నడుస్తోంది. తెలుగులో ఇటీవల మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ సినిమా విడుదల చేశారు. తాజాగా విడుదలైన విరాటపర్వం సినిమా కూడా సరళ అనే మహిళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తమిళంలో ఇటీవల విడుదలైన రాకెట్రీ సినిమా కూడా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకులని ఆకట్టుకొని హిట్ టాక్ సొంతం చేసుకుంది.

జూలై 1వ తేదీన విడుదలైన ఈ సినిమా గురించి స్టార్ హీరో రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ సినిమా చూసిన రజినీకాంత్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ట్విట్టర్ లో ఒక స్పెషల్ నోట్ పోస్ట్ చేసాడు. ఈ క్రమంలో సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మాధవన్ మీద ప్రశంసలు కురిపించాడు. రజినీ కాంత్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన స్పెషల్ నోట్ లో రాకెట్రీ.. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ముఖ్యంగా యువకులు ఈ సినిమా తప్పకుండా చూడండి అంటూ రాసుకొచ్చాడు.

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మాధవన్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకి మాధవన్ దర్శకత్వం వహించాడు. భారతదేశ అంతరిక్ష పరిశోధన కోసం పనిచేస్తున్నప్పుడు నంబి నారాయణ్ కి జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఇలాంటి చిత్రాన్ని అందించినందుకు మాధవన్ కు ధన్యవాదాలు తెలుపుతూ రజినీ కాంత్ అంటూ ట్వీట్ చేశారు . అంతేకాకుండా ఈ సినిమాలో నంబి నారాయాన్ సాధించిన విజయాలతో పాటు అతడి మీద పెట్టిన తప్పుడు కేసులలో నిర్దోషి అని నిరూపించుకోవటానికి ఆయన చేసిన ప్రయత్నాలు బాగా చూపించారు అంటూ రాడుకొచ్చాడు.