Murali Naik: ఇటీవల ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో సత్యసాయి జిల్లా కల్లితాండకు చెందిన జవాన్ మురళి నాయక్ యుద్ధ పోరాటంలో మరణించిన విషయం తెలిసిందే ఇక ఈయన మరణం పై రెండు తెలుగు రాష్ట్రాలలో నివాళులు అర్పించారు ఇకపోతే మురళి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున భరోసా కల్పిస్తూ అండగా నిలిచారు అలాగే ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా మురళి కుటుంబానికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇక ఇటీవల మురళి నాయక్ తల్లిదండ్రులు గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇక ఈ ట్రైలర్ లంచ్ కార్యక్రమంలో భాగంగా జవాన్ మురళి కుటుంబ సభ్యులకు గౌతమ్ కృష్ణ లక్ష రూపాయలతో పాటు యాంకర్ స్రవంతి కూడా లక్ష రూపాయలు అందచేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మురళి నాయక్ చేసిన ఒక గొప్ప పని గురించి ఆయన తండ్రి తెలియజేశారు.. అయితే ఆ విషయం తన కొడుకు చనిపోయే వరకు వారికి కూడా తెలియదనే విషయాన్ని బయటపెట్టారు. భారత సరిహద్దుల్లో జవాన్ గా పనిచేస్తున్న మురళి నాయక్ ప్రతినెలా తన జీతంలో 10000 రూపాయలను శ్రీ సత్యసాయి జిల్లాలోని అనాథల కోసం పంపించేవారని తెలిపారు.
ఇలా తను చేస్తున్న సహాయం గురించి మా వద్ద ఎప్పుడూ చెప్పలేదు అయితే మురళి చనిపోయిన తర్వాత ఈ ఆశ్రమానికి సంబంధించిన వారు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చి ఈ విషయాన్ని బయట పెట్టారని మురళి తండ్రి ఈ సందర్భంగా మురళి నాయక్ చేసిన మంచి పని గురించి తెలియజేయడంతో అందరూ అతని మంచి మనసు పై ప్రశంసలు కురిపించడమే కాకుండా మురళి తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాలి అంటూ భరోసా కల్పిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మురళి తల్లిదండ్రులకు ఆయనొక్కడే కుమారుడు కావడం గమనార్హం.