Pawan Kalyan: పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ యుద్ధంలో వీర జవానులు కూడా మరణించారు. ఇలా మరణించిన వారిలో శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండకు చెందిన మురళి నాయక్ అనే వీర జవాన్ కూడా అశువులు బారిన సంగతి మనకు తెలిసిందే. ఇలా యుద్ధంలో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందారు.
నేడు మురళి నాయక్ అంత్యక్రియలు జరిగాయి ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నాయకులు మురళి నాయక్ కు నివాళులు అర్పించడమే కాకుండా తన కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కూడా మురళి నాయక్ కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఇక మురళి నాయక్ దేశం కోసం చేసిన సేవలను గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం కూడా భారీ విరాళం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయలు నగదు ప్రకటించడమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలను మురళి కుటుంబానికి అందజేయనున్నారు. అదేవిధంగా మురళి నాయక్ కుటుంబంలో ఒకరికి ఏపీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వనున్నారు అలాగే 300 గజాల ఇంటి స్థలం కూడా కేటాయించారు. ఇక ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఇవ్వబోతున్నట్లు తెలియచేశారు.
జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి గౌరవించుకుంటామన్నారు. జవాను స్థానికులకే కాదు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం. గ్రామానికి మురళీ నాయక్ పేరు పెడతామనీ పవన్ కళ్యాణ్ తెలియజేయడమే కాకుండా మురళి నాయక్ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు.వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలకు పలువురు ఏపీ మంత్రులు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సవిత, అనగాని సత్యప్రసాద్, పలువురు నేతలు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు వచ్చారు.