రెండు వేలు నోటు చెలామణి నుంచి వెనక్కి తీసుకున్నారనే వార్త వెలువడినప్పటి నుంచే ఆ నోట్ల భవిష్యత్తుపై ప్రజల్లో అసహజమైన గందరగోళం మొదలైంది. 2023 మే 19న భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేల కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అవి చెల్లుబాటు అవుతాయా.. లేదా అన్న సందేహం చాలా మందికి ఉంది. ఈ సమయంలో ఆ ప్రశ్నకు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా పార్లమెంట్ ఆర్థిక స్థాయీ కమిటీలో పూర్తి క్లారిటీ ఇచ్చారు.
గవర్నర్ చెప్పిన వివరాల ప్రకారం.. రూ. 2,000 నోట్లు ఇక నుంచి ముద్రించమని.. అయితే వాటిని చట్టవిరుద్ధ కరెన్సీగా ప్రకటించ లేదని తెలిపారు. ఇవి ఇప్పటికీ చెల్లుబాటు అయ్యే నోట్లే. అంటే మీ దగ్గర ఇప్పటికీ ఈ నోట్లు ఉంటే.. వాటిని బ్యాంకు ఖాతాలో జమ చేయవచ్చు. RBI ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మార్చుకోవచ్చు. చట్టబద్ధ మార్గాలే తప్ప ఎలాంటి భయం అవసరం లేదని గవర్నర్ హామీ ఇచ్చారు.
తాజా గణాంకాల ప్రకారం, జూన్ 2025 వరకు దేశవ్యాప్తంగా ఇంకా రూ.6,099 కోట్ల విలువైన రెండు వేలు నోట్లు చలామణిలోనే ఉన్నాయి. సమాచారం లోపం, భయంతో చాలా మంది మార్పిడి చేయకుండా దాచేసుకున్నారు. కానీ ఇప్పుడు గవర్నర్ ప్రకటనతో వారికి ఊరట లభించింది. అదేవిధంగా, నకిలీ నోట్ల కదలికలపై RBI మరింత కసరత్తు చేస్తోందని, ఆధునిక టెక్నాలజీతో వాటిని గుర్తించి కట్టడి చేస్తామన్నారు. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు కూడా ప్రభుత్వం, RBI కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే, రెండు వేలు నోట్లు చెలామణి నుంచి తప్పుకున్నా చెల్లుబాటు అయ్యే నోట్లే. చట్టబద్ధ మార్గాల్లో డిపాజిట్ చేయండి, మార్చుకోండి. అనుమానాలు, భయాలు వద్దు. ఇక ఏ మార్పిడైనా అధికారిక మార్గంలోనే జరగాలి. RBI చెప్పిందే ‘‘రెండు వేలు వద్దని భయపడకండి.
