గత యాభై రోజులకు పైగా లాక్ డౌన్ తో దేశం అష్టదిగ్భందనమైంది. ఇప్పుడిడప్పుడే కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు సడలింపులి స్తున్నాయి. నిన్నటి వరకూ మూడవ దశ లాక్ డౌన్ అమలులో ఉంది. ప్రస్తుతం నాల్గవ దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అధికంగా ఇచ్చాయంటూ వినియోగదారులు ఆందోళ చెందుతున్నారు. అమరావతిలో కొంత మంది ఆందోళనకు దిగడం జరిగింది. దీనికి ప్రభుత్వం అంతే వేగంగా స్పందించింది. జూన్ వరకూ బిల్లులు చెల్లించొద్దని…తప్పులంటే సవరించుకుని మళ్లీ రీడింగ్ లు చెక్ చేసుకుని కొత్త బిల్లులు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నేతలు సోమవారం ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ర్టంలో ధర్నా చేయకూడదని తెలిపారు. ధర్నా చేస్తున్న వామపక్ష నేతల్ని ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు. దీనిలో భాగంగా విజయవాడ బందర్ రోడ్డులో రంగా సెంటర్ లో ధర్నా చేస్తున్న సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసారు. విజయవాడలో సెక్షన్ 30, 40 అమలులో ఉందని, ముందొస్తు అనుమతి లేకుండా ధర్నాలు, నిరసనలు, నిషేధమని పోలీసులు తెలిపారు. దీంతో కమ్యునిస్టు పార్టీలపై కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం రాష్ర్టంలో కొవిడ్ -19 స్వైర విహారం చేస్తోన్న సమయంలో ధర్నాలు చేయడం ఏంటని? అధికార పక్షం ప్రశ్నిస్తోంది. తక్షణమే బిల్లులు చెల్లించమని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేదని..తప్పులుంటే సవరించుకుని కొత్త బిల్లులు ఇస్తామన్నా? కమ్యునిస్టులు ఇలా రోడెక్కడం పద్దతిగా లేదరన్నారు. ధర్నాలు చేయడానికి ఇదే సరైనా సమయమా? అని అధికార పక్షం నేతలు ప్రశ్నిస్తున్నారు. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత, ప్రభుత్వ అనుమతితో చేసుకుంటే తమకెలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ఇదంతా చూస్తుంటే కేవలం ప్రచారం స్టంట్ లా అనిపిస్తోందని వామ పక్షాలపై మండిపడ్డారు.