Crime News: భూ తగాదాలతో బలైన వృద్ధ దంపతులు…!

Crime News:అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఒకే ఇంట్లో ఎంతో సరదాగా గడిపిన తల్లిదండ్రులు పిల్లలు భూమి ఆస్తి తగాదాలు వచ్చేసరికి ఎవరికివారు విడిపోతారు. ఈ క్రమంలోనే ఆస్తి విషయం గురించి కన్న తల్లి దండ్రులు కట్టుకున్న వారు అనే విషయం కూడా మరిచిపోయి దాడి చేస్తూ హత్య చేస్తున్న సంఘటనలు రోజుకు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే….

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావు పల్లకి చెందిన మంచినీటి వెంకటి తమ్ముడు రాజయ్య మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాజయ్య కుమారుడు రవితేజ గురువారం తోటకు వెళ్లి బావి నీటి విషయంలో తన పెదనాన్న వెంకటి తో ఘర్షణ కు దిగాడు. ఇలా వీరి ఇద్దరూ మధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే పెదనాన్న పై దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రవితేజ గొడ్డలి తీసుకొని తన పెద నాన్న పై దాడి చేశాడు. ఈ క్రమంలోనే తనని గొడ్డలితో నరికి సమీపంలోని ముళ్లపొదల్లోకి పడేశాడు.

ఈ విషయాన్ని దూరం నుంచి పొలంలో కలుపు తీస్తూ గమనించిన వెంకటి భార్య కనకమ్మ గొడవ ఆపడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే రవితేజ తన పెద్దమ్మ పై కూడా గొడ్డలితో దాడి చేశాడు.అనంతరం నిందితుడు బసంత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. మృతి చెందిన వెంకటి దంపతులకు కూతురు రాధ,కుమారుడు రమేష్ ఉన్నారు. రమేష్ పై చదువుతుండగా, రాధకు వివాహం జరిగింది. ఈ విధంగా ఆస్తి కోసం తన తల్లిదండ్రులను కోల్పోవడంతో రాధా, రమేష్ కన్నీటిపర్యంతమయ్యారు.