ఆదివారం రాజ్యసభలో ప్రతిపక్ష నిరసనలు మరియు మాటల ఘర్షణల మధ్య వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఆమోదించబడ్డాయి. ఆ సంఘటనలు కారణంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సోమవారం నాడు ఎనిమిది మంది ప్రతిపక్షాల సభ్యులను ఒక వారం పాటు సస్పెండ్ చేశారు.
“నిన్న రాజ్యసభలో కొంతమంది సభ్యులు ముందుకు వచ్చి డిప్యూటీ చైర్మన్ గారిని బెదిరించారు. ఆయన తన కర్తవ్యాన్ని చేయకుండా అడ్డుకున్నారు. ఇది దురదృష్టకరం మరియు ఖండించదగినది. అది ఒక చెడ్డ రోజు.నేను ఎంపీలకు సూచిస్తున్నాను, దయచేసి కొంత ఆత్మపరిశీలన చేయండి ,” అని ఆయన అన్నారు.
పార్లమెంటు విధానాల నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 46 మంది ప్రతిపక్ష ఎంపీల నుంచి డిప్యూటీ చైర్మన్‌కు వ్యతిరేకంగా తనకు లేఖ వచ్చిందని వెంకయ్య నాయుడు తెలిపారు.డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు సోమవారం తిరస్కరించారు.
“డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రాగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్ మరియు ఎలమరన్ కరీంలను తమ వికృత ప్రవర్తన కారణంగా వారం రోజుల పాటు సస్పెండ్ చేశాను ” అని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు సోమవారం చెప్పారు.ప్రతిపక్ష సభ్యులు డిప్యూటీ చైర్మన్ సీటు మీదకి చొరబడి వెళ్లడంతో రాజ్యసభ ఆదివారం ఆ వికృత దృశ్యాలను చూసింది.