తెలుగు మీద కోపంతోనే మలయాళంలోకి ఈషా రెబ్బా ?

Eesha Rebba trying to settle in Malayalam

Eesha Rebba trying to settle in Malayalam

మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఉన్నదే ఒకరో ఇద్దరో. వారిలోనూ లైమ్ లైట్లో ఉన్నది ఈషా రెబ్బ ఒక్కరే. అందం, అభినయం రెండూ ఉన్నా ఆమెకు పెద్ద పెద్ద ఆఫర్లు రావట్లేదు. మీడియా రేంజ్ హీరోల సినిమాల్లో కూడ లీడ్ రోల్స్ దొరకట్లేదు. ఏదో సెకండ్ హీరోయిన్ పాత్రల్లాంటివే వస్తున్నాయి. కానీ ఈమధ్య అవి కూడ తగ్గాయి. ఆమె చేతిలో చెప్పుకోదగిన సినిమాలే లేవు. మొన్నామధ్యన ‘శాకుంతలం’ చిత్రంలో ఒక కీ రోల్ చేసే ఆఫర్ వచ్చిందని, కానీ రెమ్యునరేషన్ తక్కువ కావడంతో వదులుకుందని వార్తలొచ్చాయి. ఆమె అడిగినంతా నిర్మాతలు ఇవ్వనన్నారనే ఆమె సినిమా చేయనందని చెప్పుకొచ్చారు అందరూ.

అయితే ఈషా రెబ్బ మాత్రం ఆ సినిమాలో ఆఫర్ వచ్చిందని కానీ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని అన్నారు. అంతేకాదు ఆమె తెలుగులో కాకుండా మలయాళం ఇండస్ట్రీ మీద ఎక్కువ దృష్టి పెడుతోంది. అక్కడ ఆమెకు వచ్చిన మొదటి అవకాశమే పెద్దది. అరవింద్ స్వామితో ఆమె నటించనుంది. అది కూడ అరవింద్ స్వామి 25 ఏళ్ల తర్వాత మలయాళంలో చేస్తున్న సినిమా. ఆ సినిమాలో ఆఫర్ రావడం గొప్ప విషయమే. ఆ సినిమా గనుక మంచి విజయాన్ని అందుకుంటే ఈషాకు తెలుగు కంటే అక్కడే ఎక్కువ ఆఫర్లు వస్తాయి. అప్పుడిక ఆమె తెలుగుకు గుడ్ బై చెప్పేసి అక్కడే సెటిలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.