Radhe Shyam: రాధే శ్యామ్ సినిమా నుంచి మరొక రొమాంటిక్ సాంగ్ విడుదల.. మామూలుగా లేదుగా.?

Radhe Shyam: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాకు రాధా కృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.

Ee Raathale Video Song [4k] | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K

ఈ రాతలే అంటూ సాగే పాటను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది రాధేశ్యామ్ చిత్రబృందం. ఈ పాటను విడుదల చేస్తూ రెండు హృదయాలు కలిస్తే మెలోడీ పుడుతుంది అంటూ కాప్షన్ ను కూడా రాసుకొచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మార్చి 11 న విడుదల కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమా నుంచి విడుదలైన పాటను హిందీ, తమిళం,మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల చేశారు.