‘లైగర్’ విజయ్ దేవరకొండని ఈడీ అందుకే పిలిచిందా.?

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ‘లైగర్’ సినిమాకి సంబంధించి దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, మరో నిర్మాత ఛార్మిలను విచారించింది. తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా విచారణకు హాజరయ్యాడు. కానీ, హీరోయిన్ అనన్య పాండేని ఎందుకు ఈడీ విచారించలేదు.?

‘లైగర్’ సినిమా నిర్మాణానికి సంబంధించి అక్రమంగా నిధులు వచ్చి పడ్డాయన్నది ప్రధాన ఆరోపణ. విదేశాల నుంచి నిధులు పూరి, ఛార్మి అలాగే హీరో విజయ్ ఖాతాల్లోకి వెళ్ళాయని ఈడీ అనుమానిస్తోందా.? యంగ్ హీరో విజయ్ ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అసలంటూ సినిమా బిజినెస్ విషయంలో పొంతనలేని ప్రచారాలు చేయడం వల్లే ఈ దుస్థితి అన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సక్సెస్ అయ్యాక పూరి, ఛార్మి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ‘లైగర్’ నిర్మాణంలో వుండగానే ‘జనగనమన’ సినిమానీ అనౌన్స్ చేశారు. ‘లైగర్’ మాత్రమే కాదు, ‘జనగనమన’ కోసం కూడా పెట్టుబడులు తీసుకొచ్చారట. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా తనవంతు రాజకీయ ప్రయత్నాలు చేశాడన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ విచారణ అన్న చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై పూరి మీద విజయ్ గుస్సా అవుతున్నాడట. తనను అనవసరంగా వివాదంలో ఇరికించాడన్న ఆవేదనతో.