Duvvada: దువ్వాడ శ్రీనివాస్ పరిచయం అవసరం లేని పేరు ఈయన వైసిపి ఎమ్మెల్సీగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నప్పటికీ ఇటీవల కాలంలో వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తన భార్యను దూరం పెట్టి దివ్వెల మాధురితో కలిసి ఈయన ప్రేమ ప్రయాణం కొనసాగించడంతో వార్తల్లో నిలిచారు. ఇలా తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలిచినటువంటి దువ్వాడ శ్రీనివాస్ పై వేటు పడుతుందని అందరూ భావించారు కానీ జగన్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై గతంలో స్పందిస్తూ పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని తెలిపారు. అప్పటినుంచి మాధురి దువ్వాడ శ్రీనివాస పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తమ ప్రేమ కబుర్లను చెబుతూ వచ్చారు. అయితే ఉన్నఫలంగా వైసీపీ దువ్వాడ పై సస్పెన్షన్ వేటు వేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసిన అందుకే చర్యలు తీసుకుంటున్నట్లు అధిష్టానం తెలిపింది.
ఇలా దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటుపడటంతో ఈయన సస్పెన్షన్ గురించి ఎన్నో రకాలుగా వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈయనపై వేటు వేయడానికి మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఇద్దరు కూడా నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించడమే సస్పెన్షన్ కి కారణమంటూ మరో వార్త బయటకు వచ్చింది.ఉప ముఖ్యమంత్రి పవన్ తోపాటు లోకేశ్ సమర్థుడైన నాయకుడంటూ దువ్వాడ జంట కీర్తించారట.. ఇది ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేతకు నచ్చలేదని, ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లడంతోనే తనపై వేటు పడిందని పలువురు భావిస్తున్నారు. మరి ఎలాంటి కారణం లేకుండా దువ్వాడ పై సస్పెన్షన్ వేటు వేయడానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
