డేటింగ్ పై డస్కీ బ్యూటీ పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ రిప్లై.!

ఇప్పుడు ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళ్ మరియు బాలీవుడ్ లో కూడా అనేక సినిమాలతో బిజీ బిజీగా లైఫ్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది పూజా హెగ్డే అని చెప్పాలి. హాట్ అండ్ డస్కీ హీరోయిన్ గా పిలుచుకునే ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో లక్కీ చార్మ్ గర్ల్ గా కూడా పేరు తెచ్చుకుంది. మరి ఇంత బిజీగా ఉండే హీరోయిన్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?

ఎవరితో అయినా డేటింగ్ లో ఉందా అనే ప్రశ్నలు లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఎదురయ్యాయి. మరి దీనికి పూజా కూడా ఓ ఇంట్రెస్టింగ్ రిప్లై నే ఇచ్చింది. తాను ఇప్పుడు అయితే తన సినిమాల డేట్స్ లో బిజీగా ఉన్నాను కానీ ఎవరితోనో అయితే డేట్ లో లేనని క్లారిటీ ఇచ్చింది. అంటే పూజా హెగ్డే ఇప్పుడప్పుడే కమిట్ అయ్యే ఆలోచనలో లేదని కెరీర్ పరంగా మాత్రమే క్లారిటీగా ఉందని కన్ఫర్మ్ అయ్యింది.