Dulquer Salmaan: టాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కాలంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. సినిమాలు అన్నీ సక్సెస్ అవుతుండడంతో దుల్కర్ సల్మాన్ అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
దుల్కర్ అడుగు పెడితే గెలుపు తలుపు తడుతోంది. కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రప్ఫాడిస్తున్నారు దుల్కర్. తాజాగా ఈయన నిర్మించిన లోక్: ఛాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హీరోయిన్ సినిమా కొత్త లోక ఛాప్టర్. కేరళ జానపద కథల్లోకి నీలి అనే పాత్ర చుట్టూ ఈ క్యారెక్టర్ సాగుతుంది. ఫాంటసీ అంశాలతో పాటు అదిరిపోయే స్క్రీన్ ప్లే కొత్త లోక సినిమాకు ప్రధాన బలం అని చెప్పాలి. తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు దుల్కర్ సల్మాన్.
తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై నాగవంశీ విడుదల చేసారు. వార్ 2 డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన నాగ వంశీ కొత్త లోక సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కారు. తెలుగులో చాలా సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రానికి మౌత్ పబ్లిసిటీ బాగా హెల్ప్ అవుతుందని చెప్పాలి.దానికి తోడు పాజిటివ్ టాక్ కూడా రావడంతో ఈ వీకెండ్ నాటికి కొత్త లోక కలెక్షన్స్ ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఇలా హీరోగా, అలాగే నిర్మాతగా వరుస సక్సెస్ లతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. దాంతో దుల్కర్ సల్మాన్ ని అభిమానులు లక్కీ సల్మాన్ అని పిలుస్తున్నారు.
Dulquer Salmaan: ఇది కదా అదృష్టం అంటే.. దుల్కర్ సల్మాన్ ని వెంటాడుతున్న గెలుపు.. ఏం చేసినా హిట్లే!
