తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం మీద వ్యతిరేకత తారాస్థాయిలో ఉందని ప్రతిపక్షాలు మరొకొన్ని మేధావి వర్గాలు అంటున్నాయి. దాని ప్రభావం రాబోయ్ దుబ్బాక ఎన్నికల్లో ఉండబోతుందని కొందరు చెపుతున్న మాట. ఇదే విషయాన్నీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెపుతూ, తెలంగాణ బీజేపీకి యూత్ సపోర్ట్ ఎక్కువగా ఉందని, దానిని తక్కువ అంచనా వేయొద్దని, నిజామాబాదు లో సీఎం కూతురినే ఓడించిన విషయాన్నీ మర్చిపోవద్దంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చాడు.
మంత్రి హరీష్ రావు బీజేపీ నేతను ఉద్దేశించి ‘‘బీజేపీ క్యాండిడేట్ వెంట నలుగురు పోరగాళ్లు తిరుగుతున్నారు’’ అంటూ మాట్లాడిన మాటలకూ కౌంటర్ గానే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. గెలుపు కోసం సర్వ శక్తులు ఓడిపోరాడుతున్న బీజేపీ పార్టీ దుబ్బాకలో బీసీ కార్డు ను ఎక్కువగా ఉపయోగిస్తుంది. దుబ్బాకలో 90 వేల బీసీ ఓట్లు వున్నాయి , అందుకే ప్రధాని మోడీ కూడా బీసీ కులానికి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం చేస్తుంది. కేంద్రంలోని బీజేపీ దుబ్బాక నియోజకవర్గం కి దాదాపు 285 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని, దమ్ముంటే తెరాస నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు.
ఇక్కడి బీజేపీ అభ్యరి రఘునందన్ రావు కూడా గత కొన్నేళ్ల నుండి దుబ్బాక కేంద్రంగా పనిచేస్తున్నాడు. అర్ద బలం, అంగబలం కలిగిన నేతగా ఆయనకు పేరుంది. ప్రతి గ్రామంలో తనకంటూ సొంత క్యాడర్ ను సిద్ధం చేసుకోవటం ఆయనకు బాగా కలిసొచ్చే అంశం. దుబ్బాక అంటే రఘునందన్ అనే విధంగా ఆయన ప్రచారంలో చేసుకోవటంలో బాగానే సక్సెస్ అయ్యాడు. సిద్దపేట అభివృద్ధి కోసం మంత్రి హరీష్ రావు దుబ్బాకను నాశనం చేశాడని, ఇక్కడకు రావలసిన పాలిటెక్నిక్ కాలేజీ ను ఇర్కోడ్ కు తరలించుపోయాడు. అలాంటి హరీష్ రావును ఎలా నమ్ముతారు, మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో అధికారంలో వున్నా తెరాస ఏమి సహాయం చేసింది అంటూ తెరాస వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ నాయకులు ముందుకి వెళ్తున్నారు. వాళ్ళ ఉత్సహం చూస్తూనే ఈ ఎన్నికల్లో గులాబీ బాస్ కు షాక్ తగలటం ఖాయమని అంటున్నారు.