దుబ్బాక శాసనసభ నియోజకవర్గం సిట్టింగ్ ఎమెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలచి అధికార పార్టీ తెరాసను దెబ్బకొట్టాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిసైస్ అయింది. అందుకే బలమైన అభ్యర్థిని వెతికే పనిలో పడింది. గతంలో రాష్ట్రం విడిపోకముందు ఇక్కడ కాంగ్రెస్ నుండి చేరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అక్కడ క్యాడర్ ఉంది. అయితే బలమైన అభ్యర్థే కరువయ్యాడు. ఇప్పుడు ఆ అభ్యర్థిని పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా బీజేపీ గత రెండు దఫాలుగా తమ తరపున పోటీచేస్తూ ఓడిపోతున్న రఘునందన్ రావుకే ఈసారి కూడ అవకాశం ఇస్తుందని అంటున్నారు.
సోలిపేట రామలింగారెడ్డి చాలా బలమైన నేత కాబట్టి తెరాస గత రెండు ఎన్నికల్లో పూర్తి అధిపత్యం కనబర్చింది. కానీ ఇప్పుడు ఆయన లేరు. అయన లాంటి అభ్యర్థి తెరాసకు దొరకడం దాదాపు అసాధ్యం. దీన్నే ప్రధాన ప్రతిపక్షం అవకాశంగా భావిస్తోంది. అయితే ఇక్కడ సానుభూతి అంశం పనిచేస్తుంది కాబట్టి గెలవడం అంత సులభం కాదు. కానీ గట్టిగా కష్టపడితే గెలుస్తామని, ఒకవేళ గెకవలేకపోయినా భవిష్యత్తుకు దారులు వేసుకోవచ్చని భావిస్తోంది. అందుకే గట్టి అభ్యర్థిని పెట్టుకుని ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్, తెరాసల మీద గట్టిగా మాట్లాడగలిగే సత్తా రేవంత్ రెడ్డి ఒక్కరే. ఆయన మాటలే జనానికి కొద్దిగా రుచిస్టున్నాయి.
అందుకే ఆయన్ను రంగంలోకి దింపుతారట. దీంతో తెరాస కూడ అలర్ట్ అయింది. రేవంత్ రెడ్డి సామర్థ్యం ఏమిటో కేసీఆర్ కు బాగా తెలుసు. నిత్యం కనిపెట్టుకుని ఉంటేనే అతన్ని ఆపడం కష్టం, అలాంటిది నిర్లక్ష్యం చేస్తే ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని భావించి ట్రబుల్ షూటర్ హరీష్ రావును దింపాలని భావిస్తున్నారట. మెదక్ జిల్లా వ్యాప్తంగా హరీష్ రావుకు మంచి పలుకుబడి ఉంది. జిల్లా రాజకీయ వ్యవహారాలను, శక్తులను ప్రభావితం చేయగల సత్తా ఉన్న వ్యక్తి. అందుకే కేసీఆర్ ఆయనకు దుబ్బాక బాద్యత అప్పగించాలనుకుంటున్నారట. ఒకవేళ నిజంగానే దుబ్బాకలో ఇరు పార్టీల తరపున రంగంలోకి దిగితే వాతావరణం యుద్దంలా మారడం ఖాయం.