దుబ్బాక పోరు తో ఉత్తమ్,రేవంత్ భవిష్యత్తు తేలనుందా..?

uttam revanth reddy telugu rajyam

  ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక వేడి బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా దుబ్బాక ఎన్నిక సెగ కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. మరి ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పని తీరుకు నిదర్శనంగా కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తుంది. రాష్ట్ర స్థాయి నేతల్లో కూడా అదే అభిప్రాయం కనిపిస్తుంది.

uttam kumar reddy telugu rajyam

 

 నిజానికి గతంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ పదవి నుండి తొలిగించి, ఆ స్థానంలో రేవంత్ రెడ్డిని ఖరారు చేసారు. అయితే పార్టీలోని సీనియర్ నేతలు వ్యతిరేక స్వరం వినిపించట తో కాంగ్రెస్ హై కమాండ్ వెనక్కి తగ్గింది. ఉత్తమ్ కుమార్ రెడ్డినే ఉంచాలి, లేకపోతే ఆ బాధ్యతలు నాకు అప్పగించండని అంటూ జగ్గారెడ్డి లాంటి నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో పొరపెచ్చులు వస్తే వాటిని క్యాష్ చేసుకొని అందులోని నాయకులను చేర్చుకోవటానికి తెరాస,బీజేపీ పార్టీలు సిద్ధంగా వున్నాయి, అందుకే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చే విషయంలో గట్టి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీనికి తోడు ఉత్తమ్ వర్గం మాట్లాడుతూ దుబ్బాక ఉపఎన్నిక, GHMC ఎన్నికలు జరిగేదాకా ఆయన్నే ఉంచండంటూ కోరటం జరిగింది.

  ఉత్తమ్ వలన కాంగ్రెస్ పార్టీకి ఒనగూరిన లాభం పెద్దగా లేదనే చెప్పాలి. అయితే ఆఖరి అవకాశం ఇద్దామనే ఆలోచనతోనే కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ కి ఈ అవకాశం ఇచ్చింది. దీనితో ఉత్తమ్ ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకోని ప్రచారం చేస్తున్నాడు, ఆయనకు బాగా అనుకూలమైన నేతలను అక్కడ ఇంచార్జి లుగా నియమించుకున్నాడు. తనకు నచ్చిన నర్సారెడ్డి కి టిక్కెట్ ఇవ్వాలని కేవలం అతని పేరు ఒక్కటే హైకమాండ్ కి పంపించాడు. అదే విధంగా ప్రచార విషయంలో కూడా పూర్తి స్వేచ్ఛ ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఇచ్చారు. దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ కర్త, కర్మ, క్రియ అన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే పీసీసీ పదవికి ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమి లేదు. ఏమైనా తేడా జరిగితే మాత్రం కచ్చితంగా పదవి పోవటం ఖాయం.. ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి రావటం ఖాయం. రేవంత్ రెడ్డి కూడా పీసీసీ పదవి కోసం యుద్ధం చేస్తూనే వున్నాడు. ఈ దుబ్బాక ఎన్నికతో ఆ విషయం కూడా తేలిపోతుంది. దుబ్బాక ఎన్నికలు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటు రేవంత్ రెడ్డి కి కూడా కీలకమే అన్నమాట..