దుబ్బాక ఉప ఎన్నిక: షెడ్యూల్ విడుదల.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే

dubbaka by election notification released by ec

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది ఇక. దుబ్బాక ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అంతా వెయిట్ చేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషన్ దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది.

dubbaka by election notification released by ec
dubbaka by election notification released by ec

నవంబర్ 3న దుబ్బాక లో ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. నవంబర్ 10న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను వచ్చే నెల అంటే అక్టోబర్ 9న ఈసీ విడుదల చేయనుంది.

నామినేషన్లను అక్టోబర్ 16 వ తేదీ వరకు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 19 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో.. మంగళవారం నుంచి దుబ్బాక నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది.