అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13లో భాగంగా షార్జా వేదికగా రాజస్తా్‌న్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓటమి పాలైంది. స్మిత్ బృందం నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో ధోనీ సేన 16 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అయితే భారీ లక్ష్య ఛేదనలో ముందుండి నడిపించాల్సిన సీఎస్‌కే సారథి ఎంఎస్ ధోని అఖర్లో బ్యాటింగ్‌కు రావడాన్ని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తప్పు పట్టాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి సిక్సర్లు కొట్టి వ్యక్తిగత పరుగులు సాధించాడే తప్ప జట్టును గెలిపించలేదని విమర్శించాడు.
‘రాజస్తాన్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోని లాంటి సీనియర్ బ్యాట్స్‌మన్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వెళ్లడం నన్ను ఆశ్చర్యపరిచింది. ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి రుతురాజ్, కరన్ వంటి యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయాల్సింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సారథి బాధ్యతగా వ్యవహరించలేదు. ధోని ఆఖర్లో మూడు సిక్సర్లు కొట్టి ఆకట్టుకోవచ్చు కానీ వాటి వల్ల జట్టుకు ఏం ఉపయోగం లేదు. పక్కాగా చెప్పాలంటే అతడి వ్యక్తిగత రికార్డుల కోసమే వరుసగా సిక్సర్లు కొట్టాడు. ధోని స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా అలా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లి అలా పరుగులు చేసి ఉంటే ఇప్పటికే విమర్శల పాలయ్యేవాడు. భారీ లక్ష్య ఛేదనలో డుప్లెసిస్ మాత్రమే ఒంటరి పోరాటం చేసి ఆకట్టుకున్నాడు’ అంటూ గంభీర్ పేర్కొన్నాడు.
ఇక గంభీర్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు గంభీర్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా మరికొందరు తప్పుపడుతున్నారు. ధోనిపై ఉన్న అక్కసును గంభీర్ వెల్లకక్కాడని సీఎస్‌కే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్(74; 32 బంతుల్లో 1×4, 9×6), స్టీవ్ స్మిత్(69; 47 బంతుల్లో 4×4, 4×6) సిక్సుల వర్షం కురిపించగా.. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్(27; 8 బంతుల్లో 4×6) సైతం అదే పనిచేశాడు.
217 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్(72; 36 బంతుల్లో 1×4, 7×6) చెలరేగినా ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. షేన్‌వాట్సన్(33), మురళీ విజయ్(21), సామ్ కరన్(17), కేదార్ జాధవ్(22) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో కెప్టెన్ ధోనీ(28; 16 బంతుల్లో 3×6) హ్యాట్రిక్ సిక్సులు బాదడంతో ఆ జట్టు స్కోర్ 200కి చేరింది.