ఈ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో కన్నింగ్ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి మొదట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కానీ, ఇప్పుడిప్పుడే ఆ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి తనది జన్యూన్ గేమ్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మెల్ల మెల్లగా ఆ కన్నింగ్ గేమ్‌కి తాను కనెక్ట్ అయిపోతోంది ఆర్జే కాజల్.
వాస్తవానికి ఆర్జే కాజల్ మొదట్నుంచీ కన్నింగ్ ప్రదర్శిస్తూనే ఉంది. అయితే, యాంకర్ రవి ఆ విషయంలో ఓ మెట్టు పైనుండడంతో ఇంతవరకూ కాజల్ ఆ స్థానాన్ని అందుకోలేకపోయింది. హౌస్‌లోని తాజా పరిస్థితులు కాజల్‌లోని కన్నింగ్ మెంటాల్టీని ఒక్కొక్కటిగా బయటికి తెస్తున్నాయి.
నెగిటివిటీ అనే కాన్సెప్ట్‌లో యాంకర్ రవికీ, కాజల్‌కీ మధ్య జరిగిన చిన్న డిస్కషన్‌లో యాంకర్ రవిని బుట్టలో పడేసి, అక్కడికక్కడే మాట మార్చేసింది. నెగిటివిటీ వదిలేసి, నిన్ను నువ్వు పోజిటివ్‌గా ప్రొజెక్ట్ చేసుకో.. అని కాజల్‌కి తన వంతుగా మంచి చెప్పే ప్రయత్నం చేసిన యాంకర్ రవిని మాట మార్చేసి, కన్‌ఫ్యూజ్ చేసి పడేసింది.
ఇలా ఒక్కటి కాదు. రకరకాలుగా ‘స్ర్టేటజీ’ పేరుతో కాజల్ తన కన్నింగ్ క్యారెక్టర్‌ని బయటకు తీస్తోంది బిగ్ హౌస్‌లో.