Suside: అప్పటివరకు కూతురుతో సంతోషంగా ఆడుకున్నారు.. హత్య చేసి చివరికి ఇలా!

Suside: భార్య, భర్త వారిద్దరికీ ఓ కూతురు. ఎంతో అందమైన ఆ కుటుంబం ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇలా సంతోషంగా గడుపుతున్న వారి జీవితంలోకి ఎలాంటి ప్రళయం వచ్చిందో తెలియదు. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ జంట చివరికి తన చంటి బిడ్డను హత్య చేసి అనంతరం వారు హత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

నాగ మంగళ తాలూకా గంగవాడి గ్రామంలో నివసిస్తున్న రఘు, తనుశ్రీ ప్రేమించుకొని 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర కూతురు సిరి ఉంది. ఈ క్రమంలోనే ఈ దంపతులు మండ్యలో నివసించేవారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం ఈ దంపతులు ఇద్దరూ తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నారు. గంగ వాడి గ్రామంలో తనుశ్రీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన ఈ దంపతులు అప్పటివరకు కూతురుతో కలిసి ఎంతో సరదాగా సంతోషంగా ఆడుతున్నారు.

అయితే తన తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రఘు తనుశ్రీ ఏడాదిన్నర కూతురిని చంపి ఆపై వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఆత్మహత్య చేసుకుంటూ తమ మరణానికి ఎవరూ కారణం కాదని లెటర్ రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు.పని నిమిత్తం బయటకు వెళ్ళిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి తమ కూతురు అల్లుడు విగతజీవులుగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.