ప్రభాస్ బర్త్ డే కి ఫాన్స్ కి స్పెషల్ సర్ప్రైస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. వీటితో పాటు ఇంకో రెండు సినిమాలు సైన్ కూడా చేసాడు. అందులో ఒకటి మారుతీ సినిమా, ఇంకోటి సందీప్ వంగ ‘స్పిరిట్’.

ముందుగా మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న రిలీజ్ కానుంది. ‘కెజిఎఫ్’ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ సెప్టెంబర్ 28న, ఇక నాగ్ అశ్విన్  ‘ప్రాజెక్ట్ కె’ 2024 ప్రథమార్ధంలో రిలీజ్ అవుతుంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం  అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మొత్తం రెండు సర్ప్రైజ్ లు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సిద్ధం అవుతున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ముందుగా ఆదిపురుష్ నుండి ఆ రోజున ఒక సర్ప్రైజ్ ఉండడనుండగా అలానే ‘సలార్’ టీమ్ నుండి కూడా ఒక ట్రీట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఒక వేళ ఇదే నిజమైతే ప్రభాస్ ఫాన్స్ కి పండగే.