DeepthI – shannu Breakup: సిరి జోలికి వెళ్ళద్దు.. అంటూ దీప్తి షణ్ముఖ బ్రేకప్ పై స్పందించిన యాంకర్ రవి..!

Deepthi – shannu Breakup: ” బిగ్ బాస్ ” సీజన్ 5 ద్వారా తెలుగు ప్రేక్షకులకు షణ్ముఖ్ మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్స్ వరకు వెళ్లి రన్నరప్ గా నిలిచాడు.బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వచ్చిన తరువాత దీప్తి , షన్ముఖ్ విడిపోయారు. అయితే వారిద్దరూ విడిపోవడానికి సిరిహన్మంత్ కారణమంటూ ఆమె మీద విమర్శలు గుప్పిస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ చాలా సన్నిహితంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే స్నేహం పేరుతో వీరు నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించారు.సిరి విషయంలో షణ్ముఖ్ హద్దులు దాటడం వల్లే దీప్తి , షణ్ము ఖ్ మధ్య విభేదాలకు దారితీసింది వారు విడిపోయారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిరీహన్మంత్ ఈ విషయంపై పరోక్షంగా స్పందిస్తూ వారిద్దరూ విడిపోవటానికి తాను కారణం కాదంటూ.. ‘ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్‌ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్‌ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. ఈ మధ్య కాలంలో బిగ్బాస్ కంటెస్టెంట్లపై  జరిగే ఈ ట్రోల్స్ అన్ని ఆపాలంటూ యాంకర్ రవి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా యాంకర్ రవి మాట్లాడుతూ ‘ఎవరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా, జాగ్రత్త! హెచ్చరికల వైపు కూడా పోవట్లేదు.. దయచేసి నెగెటివ్‌ కామెంట్లు చేయడం మానేయండి ‘ అంటూ చెప్పుకొచ్చారు.

లవ్ బ్రేకప్ తర్వాత మొదటిసారి దీప్తి సునైన లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. దీప్తి సునైన షణ్ముఖ్ తో బ్రేకప్ ని అధికారికంగా ప్రకటించింది. హౌస్ నుండి షణ్ముఖ్ బయటికి వచ్చిన వెంటనే… రోజుల వ్యవధిలో దీప్తి బ్రేకప్ నోట్ విడుదల చేసింది.లైవ్ చాట్ లో నెక్స్ట్ ఏంటీ?.. అన్న ప్రశ్నకు సమాధానంగా ‘ఇప్పటి వరకు నా గురించి నేను ఆలోచించుకోలేదు. ఇకపై కెరీర్ పై ఫోకస్ పెడతాను. లైఫ్ లో ఏదైన సాధించటానికి
ప్రయత్నం చేస్తాను, అంటూ కామెంట్ చేశారు.
మొత్తానికి దీప్తి, షన్ను బ్రేకప్ కి సిరి కారణమంటూ ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.