తప్పుడు వార్తలను సృష్టించవద్దు.. మీనా ఎమోషనల్ పోస్ట్!

సీనియర్ నటిగా తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి మీనా గురించి అందరికీ తెలిసిందే.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమయంలో మీనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 10 సంవత్సరాల కుమార్తె నైనిక ఉంది.

ఈ విధంగా మీనా కూతురు భర్తతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్న సమయంలో ఈమె భర్త మరణం ఒక్కసారి ఈమెని కృంగదీసింది.ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ విద్యాసాగర్ చెన్నై ఆసుపత్రిలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా మీనా భర్త మరణ వార్త ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. విద్యాసాగర్ మరణం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆయన పావురాలు వల్ల మృతి చెందారని,పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందారు అంటూ పలు వార్తలు వినపడుతున్నాయి.

ఇకపోతే భర్త మరణం తర్వాత మీనా మొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.నా భర్త శాశ్వతంగా దూరం కావడంతో ఎంతో వేదనలో ఉన్నాను ఇలాంటి సమయంలో నా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి నా భర్త మరణం గురించి తప్పుడు వార్తలను సృష్టించవద్దు. ఇలాంటి పరిస్థితులలో నా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక నా భర్త ప్రాణాలను కాపాడటం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేసిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఐఏఎస్ రాధాకృష్ణన్ , నా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. నేను తొందరగా ఈ బాధ నుంచి బయట పడాలని నాకోసం ప్రార్థించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ ఈమె ఈ లేఖ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.