ప్రభుత్వ ఆసుపత్రి పై సీరియస్ అయిన మంత్రి హరీష్ రావు..

తాజాగా మంత్రి హరీష్ రావు హైదరాబాద్ కోటి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక అక్కడ అన్ని వార్డులను తిరిగి పరీక్షించారు. ఇక అక్కడ ఉన్న రోగులు, వారి సహాయకులతో ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు గురించి ఆరా తీయగా.. చిన్నారులకు ప్రైవేట్ మందులను వాడుతున్నట్లు తెలిసింది.

దీంతో హరీష్ రావు మందులు రాసిన వైద్యులను పిలిచి వారిపై సీరియస్ అయి పలు చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరిటెండెంట్ డాక్టర్ కే రాజ్యలక్ష్మికి సూచించారు. ఇకపై ఇటువంటి పరిస్థితులు రావద్దు అని.. రోగులకు ప్రభుత్వం అన్ని రకాల వైద్యసేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో రూ. 500 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. ప్రైవేట్ మందులకు కారకులైన వారిపై బాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.