కాబోయే భర్తను పరిచయం చేసిన నటి పూర్ణ.. వరుడు ఎవరంటే?

ప్రస్తుత కాలంలో ఒక్కొక్క హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కుతూ వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఇప్పటికే కొందరు వివాహం చేసుకొని అమ్మగా ప్రమోషన్ పొందగా మరికొందరు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక హీరోయిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది. ఈమె తెలుగు, తమిళ, మలయాళ భాషలలో పలు చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ విధంగా వెండితెరపై అవకాశాలు తగ్గడంతో ఈమె బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు తిరిగి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు రావడంతో ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న పూర్ణ మరోవైపు తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈమె పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే నటి పూర్ణ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తన కుటుంబ సభ్యులు ఆశీర్వాదంతో పూర్ణ జె బి ఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీని పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇలా తాను పెళ్లి చేసుకోబోయే విషయాన్ని, తనకు కాబోయే భర్తను ఈమె అందరికీ పరిచయం చేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈమె పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం ప్రస్తావించలేదు.