శ్రీదేవితో పాటు ఉన్న ఈ పిల్లలు ఎవరో గుర్తు పట్టారా.. వీరు కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు వారికి సంబంధించిన ప్రతి ఒక్క ఈ విషయాన్ని అభిమానులతో పంచుకొని రోజురోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే హీరోయిన్ లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను వారి అభిమానులు షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న ప్రస్తుత స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి అంటూ పెద్ద ఎత్తున ఆ ఫోటోలను ఫ్రెండ్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా అతిలోక సుందరి శ్రీదేవితో కలిసి ముగ్గురు చిన్నారులు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున దీనిని షేర్ చేస్తూ ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు చిన్నారులు ఎవరో గుర్తుపట్టండి… వీరు కూడా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగారు.. వీరెవరో గుర్తు పట్టాలంటే ఒక చిన్న క్లూ.. ఈ ముగ్గురు హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించారు.

మరి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరో గుర్తుపట్టారా..ఇప్పటికీ వీరెవరో గుర్తించలేకపోతున్నారా అయితే ఇది ముగ్గురు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించారు. వారే నగ్మా, జ్యోతిక, రోషిని. ఈ ముగ్గురు అక్క చెల్లెలు అయినప్పటికీ ముగ్గురు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈ ముగ్గురు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.