Vastu Tips: ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించాలి?

Vastu Tips: ప్రతి ఒక్కరు తమ ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగడం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పూజా కార్యక్రమాలు చేసినప్పటికీ కొందరికి ఏవిధమైనటువంటి అదృష్టం కలిసి రాదు. ఈ క్రమంలోనే కొందరు వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు.ఇలా కొన్ని రకాల వాస్తు పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడి అష్టైశ్వర్యాలను కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ వాస్తు పరిహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

మన ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడాలంటే ముఖ్యంగా మన ఇంటి ద్వారం పై ఆధారపడి ఉంటుంది. ఇలా ఇంటి ద్వారం సరైన దిశలో ఉండడమే కాకుండా ప్రధాన ద్వారం ముందు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండటం వల్ల అమ్మవారి కరుణాకటాక్ష కలుగుతుంది. అదేవిధంగా ప్రధాన ద్వారం ఇరువైపులా స్వస్తిక్ గుర్తు ఉండటం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

అదే విధంగా మన ఇంట్లో పూజ గది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే మన ఇంట్లో పూజగది ఎల్లప్పుడు తూర్పు, ఉత్తరం దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇంకా మన ఇంటి ఆవరణంలో కొన్ని రకాల మొక్కలను పెంచడం మంచి కాదు. ఎప్పుడు పాలు కారే చెట్లు, ముల్లు ఉండే చెట్టు,పెద్ద పెద్ద వృక్షాలు ఇంటి ఆవరణంలో పెంచకూడదు. ఈ విధమైన వాస్తు చిట్కాలు పాటించడం వల్ల ఇంట్లో ఎప్పుడు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.